టీఎస్ పీఎస్సీలోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు నిషేధం

టీఎస్ పీఎస్సీలోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు నిషేధం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో బోర్డులో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి టీఎస్పీఎస్సీల్లో సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లపై నిషేధం విధించింది. మార్చి 27వ తేదీ సోమవారం నుంచి ఉద్యోగులు ఎవరూ కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లను తీసుకురావద్దని ఆదేశించింది. 

అభ్యర్థుల నుంచి వచ్చే ఎలాంటి ఫిర్యాదులు అయినా ఆన్ లైన్ లోనే తీసుకోవాలని నిర్ణయించింది. పేపర్లు, పరీక్షల్లో సమస్యల పరిష్కారానికి అవసరమైతే ప్రత్యేక ఆన్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఎవరూ కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకూడదని బోర్డు నిర్ణయించింది.