ఖమ్మం జిల్లాలో మున్సి పాలిటీల్లో జనగణన ప్రారంభం

ఖమ్మం జిల్లాలో మున్సి పాలిటీల్లో జనగణన ప్రారంభం

ములుగు/ ఖమ్మం టౌన్/ భద్రాచలం, వెలుగు : మున్సిపాలిటీల్లో జనగణన ప్రోగ్రామ్​ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే సోమవారం ములుగు మున్సిపాలిటీలో నిర్వహించిన హెచ్​ఎల్​బీఎస్ కార్యక్రమ సన్నాహక సమావేశంలో కమిషనర్​ జె.సంపత్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న జగనణన హౌస్​ లిస్టింగ్​ ఎన్యూమరేషన్​ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, సమగ్ర కుటుంబ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో ప్రారంభమైన జనగణన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఇతర ఆఫీసర్లు పరిశీలించారు. 

ఈ సందర్భంగా సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లు, వార్డ్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. భద్రాచలం పట్టణాన్ని బ్లాక్లుగా విభజించి ఎన్యుమరేట్లను, సూపర్​వైజర్లను నియమించి ఇంటింటికీ తిరిగి జాబితా తయారు చేసి లేఅవుట్ మ్యాపింగ్ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు పట్టణంలోని వివిధ కాలనీల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని భద్రాచలం తహసీల్దార్​ధనియాల వెంకటేశ్వర్లు పరిశీలించి సూచనలిచ్చారు. భద్రాచలం పట్టణాన్ని 78 బ్లాకులుగా విభజించినట్లుగా తెలిపారు.