
ములకలపల్లి, వెలుగు : తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి, కృష్ణ నీటి సమస్య పరిష్కారంలో కేంద్రం విఫలమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట శివారులో పాములేరు వాగుపై నిర్మించిన ఎత్తిపోతలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకంతో 884 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
కేంద్రం అండతోనే ఏపీ ప్రభుత్వం బనకచర్ల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందని ఆరోపించారు. సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఐటీడీఏ పీవో రాహుల్, టీఎస్‌ఐడీసీ చెర్మన్ మువ్వా విజయ్ బాబు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్‌రావు, ఐబీఈఈ సురేశ్‌కుమార్, డీఈ మోతీలాల్, ఏఈ గఫూర్ పాల్గొన్నారు.