
నిజామాబాద్ లో స్పైసెస్ రీజినల్ ఎక్స్ టెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసింది కేంద్రప్రభుత్వం. దీనిపై కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. స్పైసెస్ రీజినల్ ఎక్స్ టెన్షన్ సెంటర్ ఏర్పాటుతో పసుపు బోర్డు కంటే మించి రైతులకు లాభం జరుగుందన్నారు. నిజామాబాద్ ఎంపీ ఆర్వింద్ చొరవతో ఈ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్ తో పసుపు, మిరప పంటలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులకు ఉపయోగమన్నారు పీయూష్ గోయల్.
ఇప్పటివరకు కేరళలో స్పైసెస్ బోర్డు ఆఫీస్ ఉండేది. మన రాష్ట్రంలోని పసుపు రైతుల కోసం రీజినల్ ఎక్స్ టెనషన్ సెంటర్ ను నిజామాబాద్ లో ఏర్పాటుచేసినట్టు కేంద్రం తెలిపింది. పసుపు పంట నాణ్యత, మద్దతు ధర విషయాలను రీజినల్ బోర్డు చూసుకోనుంది. పసుపుకు మద్దతు ధర కోసం… నిజామాబాద్ రైతులు ఎన్నాళ్లుగానో పోరాటం చేస్తున్నారు. రీజినల్ బోర్డు ఎక్స్ టెన్షన్ సెంటర్ ను… ఐఏఎస్ అధికారులు నేరుగా పర్యవేక్షిస్తారు. నిజామాబాద్ రైతులు కోరినదానికంటే ఎక్కువ ప్రయోజనం ఉండేలా రీజినల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్టు పియూష్ గోయల్ చెప్పారు.
రీజినల్ ఎక్స్ టెన్షన్ సెంటర్ …. నిజామాబాద్ పసుపు రైతులకు కేంద్రం ఇచ్చిన గిఫ్ట్ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. పసుపు పంటకు మద్దతు ధర పెంచేలా.. గడిచిన మూడునాలుగేళ్లపాటు వాణిజ్య శాఖ కసరత్తు చేసిందన్నారు.