
తెలంగాణ దేశానికి అన్నం పెట్టే దాన్యాగారంగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. యాసంగిలో 56 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని చెప్పారు. ఏపీలో 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరిసాగు అవుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో పర్యటించిన హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ఏం చేస్తే దేశం మొత్తం అదే చేస్తుందని, తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని వెల్లడించారు. పల్లెల రూపు రేఖలు మార్చింది కేసీఆర్ అని హరీష్ చెప్పారు. పేదల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభివృద్ధిలో పోటీపడాలని సూచించారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని, కళ్ల ముందు అభివృద్ధిని మాత్రమే చూడాలని కోరారు.