దేశంలో 200 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు

దేశంలో 200 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు

హైదరాబాద్, వెలుగు: “దేశంలో 200 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలుంటే..  దేశీయ బొగ్గుతో పాటు విదేశీ బొగ్గునూ కొనాలని కేంద్రం చెప్తోంది. లేకపోతే కోల్ ఇండియా నుంచి బొగ్గు కేటాయింపులు ఆపేస్తామని ఉత్తర్వులిచ్చింది. అయినా సరే తాము తీసుకోబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు’’అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం శాసన మండలిలో తెలిపారు. సింగరేణి బొగ్గు మెట్రిక్ టన్నుకు రూ.3,800–3,900 ఉంటే, విదేశీ బొగ్గు ఏపీలో రూ.24 వేలకు కొంటున్నారని చెప్పారు. విదేశీ బొగ్గు వాడకపోతే ఎన్‌‌టీపీసీ ద్వారా కరెంట్ ఆపుతామని కేంద్రం హెచ్చరిస్తోందన్నారు. మోడీజీ ఇదేనా మేకిన్ ఇండియా? అంటూ విమర్శించారు.