న్యూఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ వినీత్

న్యూఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ వినీత్
  •     ఎస్పీ వినీత్

మహబూబ్ నగర్ (నారాయణపేట), వెలుగు : న్యూ ఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ వినీత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. న్యూఇయర్ వేడుకలను ఆనందంగా నిర్వహించుకోవడం ప్రతిఒక్కరి హక్కు అని, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదని సూచించారు. 

శాంతియుత వాతావరణంలో వేడుకలు కొనసాగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. న్యూఇయర్  వేడుకల పేరుతో జిల్లాలోని ప్రధాన కూడళ్లలో కేకులు కట్, బైక్ ర్యాలీలు, డీజేలు నిషేధించినట్లు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.