కాంగ్రెస్ తోనే  అగ్రి చట్టాలు వెనక్కి

V6 Velugu Posted on Nov 29, 2021

భారత దేశానికి వ్యవసాయానికి అవినాభావ సంబంధం ఉందన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. దేశంలో అత్యధిక శాతం జనాభా వ్యవసాయం మీదే ఆధారపడతారన్నారు. ప్రజలను నిర్లక్ష్యం చే  నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో చర్చలు, మేధావుల సలహాలు తీసుకోకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చారని.. దీంతో ఏడాది పాటు  రైతులు ఆందోళన చేశారన్నారు. వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ ముందే చెప్పారన్నారు. కాంగ్రెస్ వరి దీక్ష కేంద్రానికి ఓ హెచ్చరిక అని అన్నారు.

చట్టాలు వెనక్కి తీసుకోవడం రైతులు, కాంగ్రెస్ విజయమన్నారు పొన్నాల. కాంగ్రెస్ హయాంలో ఈ స్థాయిలో ఆందోళనలు ఎప్పుడూ జరగలేదన్నారు. రైతే రాజు అనే నినాదంతో కాంగ్రెస్ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు.  పార్లమెంట్ లో..అమైన్మెంట్ చేసి భూసేకరణ చట్టాని ఆమోదించకుండా  కేంద్రం వెనక్కి తీసుకుందన్నారు.గోదాములో నిల్వలు ఉంటే వ్యవసాయశాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

Tagged center, ponnala lakshmaiah, withdrawn, Agri laws, Congress struggle

Latest Videos

Subscribe Now

More News