మా పాలనలో దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం : మోదీ

మా పాలనలో దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం : మోదీ

కేంద్రంలోని దర్యాప్తు సంస్థలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.  తమ పాలనలో అవినీతిపై దర్యాప్తు చేయడంలో కేంద్ర సంస్థలకు స్వేచ్ఛనిచ్చామన్నారు.  తమ ప్రభుత్వం అవినీతిని సహించబోదని చెప్పారు.  అవినీతికి వ్యతిరేకంగా ఈడీ అవలంబిస్తున్న కఠిన వైఖరిని మోదీ మెచ్చుకున్నారు. ఉదాహరణకు 2014 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ద్వారా మనీలాండరింగ్ నిరోధక చట్టంకింద 1,800 కేసులు నమోదు చేయబడ్డాయి. 

ఏజెన్సీలు స్వతంత్రంగా ఉంటే, వాటిని ఆపవలసిన అవసరం ఏమిటి అని మోదీ ప్రశ్నించారు.  గత 10 ఏళ్లలో 4వేల 700 కేసులు నమోదయ్యాయి. 2014 వరకు కేవలం రూ. 5,000 కోట్లు మాత్రమే జప్తు చేసిన ఈడీ, గత పదేళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిందన్నారు మోదీ.   కేంద్ర సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.