హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు రూ.2 కోట్ల వరకు రుణం పొందవచ్చని సెంట్రల్ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఫండ్ జాయింట్ సెక్రటరీ సామ్యూల్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మేనేజ్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఆగ్రోస్ సంయుక్త ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఫండ్ స్కీమ్‌పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. 3శాతం వడ్డీతో, రెండేండ్ల మారిటోరియం సౌకర్యం కల్పిస్తూ, ఎలాంటి కొలేట్రల్ సెక్యూరిటీ లేకుండా 7 ఏండ్లలో తిరిగి చెల్లించే విధంగా కేంద్రం ఈ స్కీమ్ తీసుకొచ్చిందని తెలిపారు. ఆగ్రోస్ వైస్ చైర్మన్, ఎండీ రాములు మాట్లాడుతూ.. అగ్రి పారిశ్రామిక వేత్తలకు ఈ స్కీమ్ ఉపయోపడుతుందన్నారు. స్కీమ్‌లో భాగంగా రాష్ట్రానికి రూ.3,075 కోట్ల టార్గె ట్ కాగా, ఇప్పటి వరకు రూ.359 కోట్లు మాత్రమే వినియోగించారన్నారు. ఈ చాన్స్‌ను ఎంటర్‌ప్రెన్యూర్స్ వినియోగించుకుని దేశంలోనే టాప్‌లో నిలవాలని ఆకాంక్షించారు.
