రూరల్ బ్యాంకులకు కేంద్రం క్యాపిటల్ సపోర్ట్ 670 కోట్లు

రూరల్ బ్యాంకులకు కేంద్రం క్యాపిటల్ సపోర్ట్ 670 కోట్లు

న్యూఢిల్లీ: రీజినల్‌‌‌‌ రూరల్‌‌‌‌ బ్యాంకు(ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీ)లకు క్యాపిటల్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌ను అందించేందుకు ప్రభుత్వం రూ. 670 కోట్లను కేటాయించింది. నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌, ఈస్ట్రన్‌‌‌‌ రీజియన్‌‌‌‌లలో ఉన్న బ్యాంకులకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 43 రూరల్‌‌‌‌ బ్యాంకుల్లో 14 పైగా బ్యాంకులు నార్త్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌, ఈస్ట్రన్‌‌‌‌ రీజియన్‌‌‌‌ల నుంచే  ఉన్నాయి. ఈ బ్యాంకుల క్యాపిటల్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్‌‌‌‌ ప్రకారం ఉండాల్సిన 9 శాతం కంటే తక్కువ ఉందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఈ రీక్యాపిటలైజేషన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ కింద కేంద్రం, సంబంధిత రాష్ట్రం, సంబంధిత బ్యాంకు కలిసి 50:15:35 రేషియోలో క్యాపిటల్‌‌‌‌ను అందిస్తాయి. వచ్చే ఏడాది మార్చి 31 వరకు బ్యాంకుల క్యాపిటల్‌‌‌‌ అవసరాలను తీర్చేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని  అధికారులు చెబుతున్నారు.