
కరీంనగర్ టౌన్,వెలుగు: రాజకీయ పార్టీల లీడర్లు ఎన్నికల ప్రచారం కోసం అధికారుల నుంచి అనుమతి పొందాలని కేంద్ర ఎన్నికల జిల్లా పోలీస్ అబ్జర్వర్ ఎ. సతీశ్గణేశన్సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారం కోసం వాహనం, మైకుల ఏర్పాటు, బహిరంగసభతో పాటు ఇంటింటి ప్రచారాలకు 24 గంటల ముందు ఎన్నికల అధికారుల తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు.
కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలను ఉల్లంఘించేవారిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో జనరల్ అబ్జర్వర్లు డా.సి.ఆర్.ప్రసన్న, ఎంఆర్ రవి కుమార్, వ్యయపరిశీలకులు శివ్ శంకర్, చిట్టే యోగేశ్ సుగ్డే, ఆర్వోలు ప్రఫుల్ దేశాయ్, మహేశ్వర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం
ఓటింగ్ నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు ట్రైనింగ్ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రో అబ్జర్వర్లు పోలింగ్టీంతో సమన్వయంతో వ్యవహరించాలన్నారు.