
- 3,301 గ్రామ పంచాయతీలకు కొత్త బిల్డింగ్లు
- సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆమోదం
న్యూ ఢిల్లీ, వెలుగు: మౌలిక వసతుల కల్పనకు కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)తో 3,301 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) ఆమోద ముద్ర వేసింది. తెలంగాణ, ఏపీ, చత్తీస్ గఢ్, పంజాబ్‌తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ భవనాలు నిర్మించనున్నట్టు సీఈసీ తెలిపింది. అలాగే గ్రామ పంచాయతీలకు 22,164 కంప్యూటర్లను మంజూరు చేసింది. మంగళవారం పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ వివేక్ భరద్వాజ్ అధ్యక్షతన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జిఎస్ ఏ) పై ఎనిమిదవ సమావేశం జరిగింది.