
మరోసారి రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తు లేటెస్ట్ గా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి 53 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కేటాయించింది. తెలంగాణకు1.45 లక్షల ఇంజక్షన్లను కేటాయించగా ఏపీకి 2.35 లక్షలు, మహారాష్ట్రకు 11.57 రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను కేటాయించింది. రెమ్‌డెసివిర్ కొరత లేకుండా రాష్ట్రాలు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది కేంద్రం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు పంపిణీ అయ్యేలా చూడాలని రాష్ట్రాలను ఆదేశించింది కేంద్రం.