ధన్యులం సామీ : శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు సగం రోజు సెలవు..

ధన్యులం సామీ : శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు సగం రోజు సెలవు..

 అయోధ్య రామమందిరంలో అయోధ్య రాముడి ప్రాణ్ ప్రతిష్ట సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు  ప్రకటించింది. జనవర 22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించింది. 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇచ్చింది.

శుభ సమయం రానే వచ్చింది.. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి ఆగమనానికి వేళయింది. అయోధ్యలో రామ్‌‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు క్రతువు కొనసాగుతోంది. మంగళవారం(జనవరి 17) మొదలైన యజ్ఞ యాగాలు ఈ నెల 21 దాకా నిర్వహిస్తారు. ఈ నెల 22న ముఖ్యమైన క్రతువులు పూర్తయిన తర్వాత.. తన జన్మభూమిలో రామయ్య కొలువుదీరనున్నాడు. ఈ వేడుకలను చూడటానికి 150 దేశాల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా 7 వేల మందికి ఆలయ ట్రస్టు ఆహ్వానాలు పంపింది. 23 నుంచి భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కల్పిస్తామని వెల్లడించింది. 

ఈక్రమంలో ఉద్యోగుల సెంటిమెంట్, వారి నుంచి వచ్చిన అభ్యర్థనల దృష్ట్యా రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట సందర్భంగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలకు జనవరి 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు హాఫ్ డే సెలవును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.