వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్టు రద్దు

వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్టు రద్దు

ఆంధ్రప్రదేశ్  సీఎం వైఎస్ జగన్మోహన్ తల్లి వైఎస్ విజయమ్మ పేరుతో ఉన్న చారిటబుల్ ట్రస్టును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతోపాటు మరో మూడు సంస్థల రిజిస్ట్రేషన్లను కేంద్రం రద్దు చేసింది. విదేశీ నిధుల నియంత్రణ చట్టం -2010 లోని సెక్షన్ 14 కింద విజయమ్మ చారిటబుల్ ట్రస్టును కేంద్ర హోమ్ శాఖ రద్దు చేసింది.

తెలంగాణలో 90 , ఏపీలో 168 ఎన్జీవోలను కూడా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వస్తున్ననిధులు, వాటిని ఖర్చు చేస్తున్న తీరుపై కేంద్రానికి నివేదికలు పంపకపోవడంతో కేంద్రం రద్దు చేసింది. FCRA చట్టం ప్రకారం వార్షిక నివేదిలకు సమర్పించాలి. కానీ ఈ సంస్థలు 2017 -18 సంవత్సరానికి  నివేదికలు పంపలేదు. రూరల్ ఎడ్యుకేషన్ డెవెలప్ మెంట్ సొసైటీ, రాయపాటి చారిటబుల్ ట్రస్టు, ఫిలడెల్ఫీయా జియాన్ మినిస్ట్రీస్, అరుణ మహిళా మండలి రిజిస్ట్రేషన్లు కూడా కేంద్రం రద్దు చేసింది.