సినీ సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్

సినీ సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసిన ఎక్సైజ్ కానిస్టేబుల్

హైదరాబాద్: సినీ సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ను తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తానంటూ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు బెదిరింపులకు దిగాడని పోలీసులకు పలువురు సెలబ్రెటీలు ఫిర్యాదు చేశారు. సినీ సెలబ్రిటీలను ఇంట్లోకి వెళ్లి మరీ సదరు ఎక్సైజ్ కానిస్టేబుల్ బెదిరించినట్లు బాధితులు పేర్కొన్నారు.

‘మీ ఇంట్లో డ్రగ్స్ దొరికాయి’ అంటూ కేసులో ఇరికిస్తానని బెదిరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పని చేస్తూ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా అని చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ మధ్య బెదిరింపులు ఎక్కువ అవ్వడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ వ్యవహారంపై సిటీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.