జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నా: MLC కవిత

జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నా: MLC కవిత

హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఉప రాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నానని అన్నారామె. పార్టీలకతీతంగా తెలుగువారంతా తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయన గెలిస్తే ఉప రాష్ట్రపతి పదవికే వన్నె తెస్తారన్నారు కవిత. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ న్యూట్రల్‎గా ఉంది. అటు ఎన్డీఏ అభ్యర్థి.. ఇటు ఇండీ అభ్యర్థికి మద్దతు తెలపకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంది. 

ఎమ్మెల్సీ కవిత మాత్రం ఉప రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్ష అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి వేటు పడ్డాక ఓ అంశంలో గులాబీ పార్టీకి వ్యతిరేకంగా కవిత తీసుకున్న తొలి నిర్ణయం ఇదే. మున్ముందు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్‎గా కవిత మరిన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.