నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లాన్ ఆఫీసర్ హారిక

నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లాన్ ఆఫీసర్ హారిక

హైదరాబాద్: నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లాన్ అధికారి హారిక ACBకి రెడ్ హ్యాడెండ్గా పట్టుబడింది. భవనం అనుమతుల కోసం హారిక లంచం డిమాండ్ చేసింది. ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లాన్ అధికారి హారికను అదుపులోకి తీసుకొని ఏసీబీ విచారించింది. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ LRS క్లియర్ చేయడానికి హారిక 10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ రోజు (మంగళవారం) 4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి.

2025 జనవరి నుంచి.. ఈ ఎనిమిది నెలల్లో లంచం తీసుకుంటూ పట్టుబడ్డవాళ్లలో 20 మందికి పైగా మహిళా అధికారులే ఉండటం గమనార్హం. ఐదారు రోజుల క్రితమే.. నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు  జిల్లా మత్స్య శాఖ అధికారిణి ఎం.చరిత రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా చరిత రెడ్డిని రెడ్ హ్యాండెడ్‎గా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ అధికారులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టు పక్కల మున్సిపాలిటీలు అవినీతికి అడ్డాలుగా మారాయి. టౌన్‌‌ప్లానింగ్‌‌ విభాగంలో భారీగా అవినీతి జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని డాక్యుమెంట్లు అందజేసినా.. ఇంటి నిర్మాణాలకు అనుమతులు జారీ చేయకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మధ్యవర్తులు, ఏజెంట్లను కలిస్తే తప్ప ఫైల్‌‌ ముందుకు కదలడంలేదు. రూ.50 వేల దగ్గర నుంచి నిర్మాణాన్ని బట్టి లక్షల్లో రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. అడిగినంత ఇస్తే తప్ప పర్మిషన్లు ఇవ్వడం లేదు.