
ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఓ లేటెస్ట్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ దుమ్మురేపుతోంది. మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా వచ్చిన ‘కమ్మట్టం’ సిరీస్.. ఆడియన్స్ను బాగానే ఎంగేజ్ చేస్తోంది. ఆరు ఎపిసోడ్లతో మిస్టీరియస్ డెత్ మిస్టరీని సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ కథ ఇది. డిటెక్టివ్ ఫీల్తో, గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్కు కావాల్సిన అన్ని అంశాలతో ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ZEE5 యొక్క మొట్టమొదటి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కావడం విశేషం.
షాన్ తులసీధరన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సిరీస్లో సుదేవ్ నాయర్, జియో బేబీ, అజయ్ వాసుదేవ్, వివ్య శాంత్, అఖిల్ కవలయూర్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 4 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.
ఈ కథ మాములు కంప్లైంట్తో మొదలైన, పెద్ద ఆర్ధిక కుంభకోణాన్నే బయటకి లాగుతుంది. ఓ వ్యక్తి చనిపోతాడు. అది కేవలం రోడ్ యాక్సిడెంట్ అనుకుని, దర్యాప్తు చేయడం మొదలు పెడతాడు పోలీసు అధికారి. ఈ క్రమంలో ఎంక్వైరీ చేస్తున్న కొద్దీ కేసు కష్టతరంగా మారుతుంది. ఇది కేవలం హత్య మాత్రమే కాదు దాని వెనుక ఆర్థిక మోసం ఉందని కనిపెడతాడు.
ALSO READ : 'బిగ్ బాస్ తెలుగు 9' కంటెస్టెంట్ కు మెగా సపోర్ట్..
అయితే, అందుకు గల లీడ్ను వ్యక్తి చనిపోయిన స్పాట్లో పోలీసు కనిపెడుతాడు. ఇదే కథలో ఉత్కంఠ పెంచుతుంది. మరి సాధారణ కేసు కంటే కూడా లోతైన మిస్టరీ ఏంటీ? అదేలా కనుగొన్నాడు? ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ నిజాలు ఏంటనేది మిగతా కథ.
മികച്ച പ്രേക്ഷക പ്രതികരണങ്ങളോടെ "കമ്മട്ടം". ഇപ്പോൾ കാണൂ, നമ്മുടെ സ്വന്തം ZEE5 മലയാളത്തിൽ#Kammattam STREAMING NOW on ZEE5@TheSudevNair @zee5malayalam #ShanThulasidharan #KammattamOnZee5 #zee5originalwebseries pic.twitter.com/28Ohbn3XmT
— ZEE5 Malayalam (@zee5malayalam) September 6, 2025
కథేంటంటే:
ఈ సిరీస్ త్రిస్సూర్‌లో జరిగే ఒక దిగ్భ్రాంతికరమైన ఆర్థిక కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. శామ్యూల్ ఉమ్మన్ (జియో బేబీ) అనే వ్యక్తి కారు యాక్సిడెంట్‌లో చనిపోతాడు. అందరూ దాన్ని సాధారణ హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తారు. పై ఆఫీసర్లు ఈ కేసుని పోలీస్ ఆఫీసర్ ఆంటోనియో జార్జ్ (సుదేవ్ నాయర్)కి అప్పగిస్తారు. అతను అది యాక్సిడెంట్ కాదని ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అని అనుమానిస్తాడు.
సంఘటనా స్థలం నుంచి ఒక నెక్లెస్ మిస్సయిందని తెలుసుకుని ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. చివరకు ఆ హత్యకు ఒక ఆర్థిక కుంభకోణమే కారణమని తెలుసుకుంటాడు? ఇంతకీ ఆ హత్య చేసిందెవరు? ఆ కుంభకోణం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాలి.