
ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమీ ఈ ఫెస్టివల్ సీజన్లో కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ సిరీస్‌లో Xiaomi 15T అలాగే 15T Pro అనే రెండు మోడల్‌లు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు ఈ ఫోన్స్ స్పెసిఫికేషన్లు, ధర విడుదలకి ముందే లీక్ అయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం, ఈ రెండు ఫోన్‌లు మొత్తం మీద ఒకే డిజైన్‌తో స్పెసిఫికేషన్స్ మారొచ్చు. సాధారణ Xiaomi 15T మోడల్ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో, Pro మోడల్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం మెటల్ ఫ్రేమ్‌తో వస్తుంది.
స్పెసిఫికేషన్స్ : ఈ రెండు ఫోన్‌లు 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, ప్రో మోడల్ 144 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది, అయితే సాధారణ 15T మోడల్ 120 Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. డిస్ ప్లే రిజల్యూషన్ 2772×1280 పిక్సెల్‌లు, 3200 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, HDR10+, డాల్బీ విజన్ ఇచ్చారు. 15T మోడల్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్‌తో పనిచేస్తుంది, అయితే ప్రో మోడల్ డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్‌తో వస్తుంది. రెండు ఫోన్‌లలో 12GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్ అప్షన్ ఉన్నాయి.
కలర్ అప్షన్స్ : ప్రస్తుతం దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ లేటెస్ట్ కలర్స్ లో వచ్చే అవకాశం ఉంది.
పవర్ ఫుల్ కెమెరా: ప్రో మోడల్‌లో OISతో 50-మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 900 ప్రైమరీ కెమెరా, శామ్‌సంగ్ JN5 సెన్సార్‌తో 50-మెగాపిక్సెల్ 5x టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. అయితే సాధారణ 15T మోడల్‌లో 50-మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ 800 ప్రైమరీ కెమెరా, OIS లేకుండా 2x జూమ్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్‌లలో 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వీటిలో లైకా బ్రాండింగ్, ఇమేజ్ ట్యూనింగ్ కూడా ఉంటాయి.
ALSO READ : GST రిలీఫ్.. రూ.4లక్ష 50వేలు తగ్గిన Kia కారు..
బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్: రెండు ఫోన్‌లలో 5500mAh బ్యాటరీ ఉంది. అయితే, సాధారణ 15T మోడల్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉండగా, ప్రో మోడల్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రెండు ఫోన్‌లకి బాక్సులో ఛార్జర్ అందించలేదు, కాబట్టి ఛార్జర్‌ను విడిగా కొనాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌లలో IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్, eSIM సపోర్ట్ ఉన్నాయి. సాధారణ 15T బరువు 194 గ్రాములు అయితే, ప్రో మోడల్ బరువు 210 గ్రాములు.
ధర : లీక్ అయిన సమాచారం ప్రకారం, వరల్డ్ మార్కెట్లో Xiaomi 15T ధర €649 అంటే సుమారు రూ. 67 వేలు, Xiaomi 15T Pro ధర €799 అంటే సుమారు రూ. 82 వేల 500లు ఉండవచ్చు.
మొత్తంమీద Xiaomi 15T& 15T Pro సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆకర్షణీయమైన డిజైన్, పవర్ ఫుల్ ప్రాసెసర్‌లు, హై లెవెల్ కెమెరా సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్ తో మార్కెట్‌లో అందరి దృష్టిని ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. సాధారణ మోడల్ బడ్జెట్ ధరకు మంచి ఫీచర్లను అందిస్తుండగా, ప్రో మోడల్ ప్రీమియం స్పెసిఫికేషన్‌లతో బెస్ట్ అనుభవాన్ని అందిస్తుంది.