GST రిలీఫ్.. రూ.4లక్ష 50వేలు తగ్గిన Kia కారు.. ఏ మోడల్ కారు ఎంత తగ్గిందంటే?

GST రిలీఫ్.. రూ.4లక్ష 50వేలు తగ్గిన Kia కారు.. ఏ మోడల్ కారు ఎంత తగ్గిందంటే?

Kia Car Rates Cut: దేశంలోని కార్ల కంపెనీలు వరుసగా తమ మోడళ్ల రేట్లపై తగ్గింపుల గురించి ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా వంటి దిగ్గజాలు వివిధ మోడళ్లపై జీఎస్టీ 2.0 తగ్గింపులతో రేట్ల తగ్గింపుల గురించి ప్రకటనలు విడుదల చేశాయి. సెప్టెంబర్ 22 నుంచి ఈ తగ్గించబడిన రేట్లకు కార్లను ఆటో లవర్స్ కొనుక్కోవచ్చని స్పష్టం చేశాయి. అయితే తాజాగా కియా మోటార్స్ కూడా తన కార్లపై మతిపోయే తగ్గింపులతో దసరా, దీపావళి అమ్మకాల పోటీని హీటెక్కించటానికి వచ్చేసింది. 

ముందుగా భారత ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపులను కియా ఇండియా ఎండీ, సీఈవో గ్వాంగు లీ అభినందించారు. ప్రజలను దృష్టిలో పెట్టుకుని పన్ను సంస్కరణలు తీసుకురావటం హర్షనీయమని అన్నారు. పాసింజర్ వాహనాలపై కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు ప్రకటించటం ఈసారి అమ్మకాలను పెంచటంతో పాటు ప్రజలకు అందుబాటు రేట్లకే వివిధ మోడల్స్ వచ్చేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం జీఎస్టీ మార్పుతలో వచ్చే పూర్తి ప్రయోజనాలను కియా తన ప్రియమైన కస్టమర్లకే పాసాన్ చేయాలని నిర్ణయించిందని సీఈవో చెప్పారు. 

ALSO READ :  ఇంకా స్టార్ట్ అవ్వని ఐపీవో..

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్ల అమలుతో కియా సోనెట్ రేటు రూ.లక్ష 64వేల 471 తగ్గనుంది. ఇక కియా సిరోస్ రేటు రూ.లక్ష 86వేల 003 తగ్గుతుండగా.. కియా సెల్టోస్ రేటు రూ.75వేల 372, కియా కారెన్స్ రేటు రూ.48వేల 513, కియా కారెన్స్ క్లావిస్ రేటు రూ.78వేల 674 తగ్గుతుందని తేలింది. ఇక చివరిగా కంపెనీ తన కియా కార్నివల్ మోడల్ రేటును అత్యధికంగా రూ.4 లక్షల 48వేల 542 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలోని ఇతర కార్ కంపెనీలు కూడా ప్రీ బుక్కింగ్స్ పెంచుకునేందుకు ఆకర్షనీయమైన రేట్ల తగ్గింపులతో ఈ పండక్కి పాసింజర్ వాహన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.