కుర్రోళ్ల దెబ్బకు ప్రధాని రాజీనామా : సోషల్ మీడియా బ్యాన్ తో ఏకంగా పదవినే కోల్పోయాడు..!

కుర్రోళ్ల దెబ్బకు ప్రధాని రాజీనామా : సోషల్ మీడియా బ్యాన్ తో ఏకంగా పదవినే కోల్పోయాడు..!

సోషల్ మీడియాపై బ్యాన్.. ఏకంగా ప్రధాని రాజీనామా వరకు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకతను కంట్రోల్ చేసే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఏకంగా పదవినే కోల్పోయేలా చేసింది. నేపాల్ దేశంలోని కుర్రోళ్లు.. ఇప్పుడు ప్రపంచానికి కొత్త నిర్వచనం చెప్పటం కాదు.. ఎన్నో కొత్త అంశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే.. యువతలో వచ్చే తిరుగుబాటు ఎంతలా ఉంటుంది అనేది మిగతా దేశాలకు రుచిచూపించారు.

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. నేపాల్ లో హింసాత్మక ఘటనలు  తీవ్రస్థాయికి చేరడంతో  తన  పదవికి రాజీనామా చేశారు ఓలీ. సైన్యం సూచనతో పదవి నుంచి తప్పుకున్నారు. సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉంది. 

సోషల్ మీడియా బ్యాన్  ఎత్తి వేసినా యువత ఆందోళనలు ఆగడం లేదు. పార్లమెంట్ సహా, ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం చేశారు .దీంతో ఓలిని రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. నేపాల్ లో ఉద్రిక్తత పెరుగుతుండటంతో సరిహద్దులో భద్రత పెంచింది భారత్.

దేశంలో సోషల్ మీడియాపై నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా సోమవారం (సెప్టెంబర్ 8) పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన జడ్ జెన్ యువత.. ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం (సెప్టెంబర్ 9) మరోసారి రోడ్డెక్కారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ముందు భారీ ఆందోళన చేపట్టారు.

పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. సమాచారశాఖ మంత్రి ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ దుబాయ్‌ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని.. ఇప్పటికే విమానాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి. యువత నిరసనలతో దేశ రాజధాని ఖాట్మండులో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఆందోళనలను అదుపు చేసేందుకు ఖాట్మండులో మరోసారి కర్య్ఫూ విధించారు అధికారులు. యువత డిమాండ్ మేరకు ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసినప్పటికీ.. ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత ప్రొటెస్ట్ కంటిన్యూ చేసింది. జన్ జెడ్ యువత నిరసనలతో ప్రభావంతో ఇద్దరు కేబినెట్ మినిస్టర్లు రాజీనామా చేశారు. హోంమంత్రి పదవికి రమేష్ అలేఖ్, వ్యవసాయ మినిస్టర్ పోస్ట్‎కు రామ్‎నాధ్ అధికారి రిజైన్ చేశారు. తాజాగా ప్రధాని కేపీ శర్మ తన పదవికి రాజీనామా చేశారు.