భారత్, మయన్మార్ మధ్య.. ఇక యథేచ్ఛగా రాకపోకలుండవ్

భారత్, మయన్మార్ మధ్య.. ఇక యథేచ్ఛగా రాకపోకలుండవ్

న్యూఢిల్లీ: భారత్‌‌, మయన్మార్‌‌ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల(ఫ్రీ మూవ్ మెంట్)ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దేశ అంతర్గత భద్రత, సరిహద్దులను కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకటించారు. "మన దేశ బార్డర్ ను రక్షించుకోవడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. అందులో భాగంగా దేశ అంతర్గత భద్రత, మయన్మార్ సరిహద్దులో ఉన్న ఈశాన్య రాష్ట్రాల జనాభా రక్షణ నేపథ్యంలో భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానం (ఎఫ్​ఎంఆర్)ను రద్దు చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది" అని అమిత్ షా తెలిపారు.