మరో 5 నెలలు ఉచిత రేషన్

మరో 5 నెలలు ఉచిత రేషన్

న్యూఢిల్లీ: పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్రం పేదలకు ఉచిత రేషన్‌ను అందించింది. ఈ పథకాన్ని మరికొన్ని నెలలకు పొడిగిస్తూ మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఈ పథకం కింద లబ్ధిదారులైన 81.35 కోట్ల మందికి జూలై నుంచి నవంబర్ వరకు ఉచిత ఆహారధాన్యాలు అందనున్నాయి. కాగా, పీఎం గరీబ్ కల్యాణ్ యోజనను తొలుత ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు అమలు చేశారు. అయితే కొన్ని రోజుల కిందట ఈ పథకాన్ని మరో 5 నెలలు పొడిగిస్తున్నట్లు మోడీ ప్రకటించారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.67,266.44 కోట్లు ఖర్చు పెట్టనుంది. రాష్ట్రాలకు 204 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేంద్రం అందించనుంది.