ఎలివేటెడ్​ కారిడార్లకు కేంద్రం అనుమతి

ఎలివేటెడ్​ కారిడార్లకు కేంద్రం అనుమతి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పలు ఎలివేటెడ్​ కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్–కరీంనగర్​ రాజీవ్​ రహదారితో పాటు హైదరాబాద్–నాగ్​పూర్​ హైవేపై ఎలివేటెడ్​ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది. హైదరాబాద్​లోని డిఫెన్స్​ భూముల మీదుగా ఎలివేటెడ్​ కారిడార్లను నిర్మించేందుకు లైన్​ క్లియర్​ చేసింది. ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి..

రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​ను కలిసి డిఫెన్స్​ భూముల మీదుగా ఎలివేటెడ్​ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్, రక్షణ శాఖ అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఎనిమిదేండ్ల పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందని, దీంతో ఉత్తర తెలంగాణ దిశగా రవాణా మార్గాల అభివృద్ధికి మార్గం సుగమమైందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్​ నుంచి శామీర్​పేట, హైదరాబాద్​ నుంచి మేడ్చల్​ రూట్లలో ట్రాఫిక్​ ఇబ్బందులు తొలగుతాయన్నారు.