నీట్​పై సీబీఐ దర్యాప్తు

నీట్​పై సీబీఐ దర్యాప్తు

నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ శనివారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. నీట్ ఎగ్జామ్​లో అక్రమాలు, అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చినందున దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని అందులో పేర్కొంది.

మరోవైపు దేశవ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్ర ఆరోగ్యశాఖ వాయిదా వేసింది. నీట్ యూజీ ఎగ్జామ్​లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఎగ్జామ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.