కేంద్రం సమగ్రశిక్షకు నిధులు పెంచలే

కేంద్రం సమగ్రశిక్షకు నిధులు పెంచలే

ఈ ఏడాది కూడా రూ.1913 కోట్లే కేటాయించిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి సమగ్ర శిక్ష(ఎస్ఎస్ఏ) ద్వారా ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ సారి పెంచలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తామని అంగీకరించిన రూ.1913 కోట్లనే వచ్చే 2024–25 సంవత్సరం కూడా ఇస్తామని తెలిపింది. 2024–25 ఏడాదికిగానూ ఈ నెల15,16 తేదీల్లో ఢిల్లీలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు అవ్రూవల్ బోర్డు (పీఏబీ) సమావేశం జరిగింది.

దీనికి తెలంగాణ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన, సమగ్రశిక్ష ఏఎస్​పీడీ రమేశ్ తదితరులతో కూడిన టీం అటెండ్ అయ్యింది. 2024–25 సంవత్సరానికిగానూ రూ.2500 కోట్ల ప్రపోజల్స్ పెట్టగా, కేంద్రం మాత్రం రూ.1913 కోట్లకే కమిట్మెంట్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. గతంలోని అంశాలే ఈ సారి కూడా కొనసాగనున్నాయి.

అయితే, సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న సుమారు 22వేల మంది కాంట్రాక్టు ఎంప్లాయీస్​కు జీతాలు పెంచుతారనే ఆశలు ఉండేవి. కానీ, గతేడాది బడ్జెట్ నే ఇస్తామన్న సూచనలతో జీతాలు పెంచే ప్రతిపాదనలను అధికారులు చేయలేదు.