ఇంట్లోనూ మాస్కులు పెట్టుకోవాల్సిన టైమొచ్చింది: కేంద్రం

ఇంట్లోనూ మాస్కులు పెట్టుకోవాల్సిన టైమొచ్చింది: కేంద్రం

కొత్త వాళ్లను ఇంటికి రానియొద్దు: పీయూష్ గోయల్

 దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందని, ఇంట్లోనూ మాస్కులు పెట్టుకోవాల్సిన టైమొచ్చిందని  కేంద్రం సూచించింది. కరోనా పరిస్థితిపై ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. అవసరమైనంత మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉందని, అయితే ట్రాన్స్ పోర్ట్ చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. 'ఆక్సిజన్ కొరతపై ఆందోళన వద్దు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ట్రాన్స్​పోర్టేషన్​లోనే సమస్య ఉంది. విదేశాలనుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను కొంటు న్నాం. కొన్నింటిని అద్దెకు తీసుకుంటున్నాం. ఆక్సిజన్​ను ట్యాంకర్లలో సరఫరా చేయడమే పెద్ద సవాలు. ఆక్సిజన్ ట్యాంకర్లు హాస్పిటళ్లకు వేగంగా చేరేలా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తున్నాం' అని అన్నారు. కరోనా సోకిందని హాస్పిటళ్లలో చేరొద్దని, దాని వల్ల  బెడ్ల సమస్య ఏర్పడుతుందన్నారు. డాక్టర్ల సలహా మేరకే హాస్పిటల్​లో చేరాలన్నారు. క్రిటికల్ పరిస్థితుల్లోనే డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకు రెమ్డెసివిర్ లాంటి మందులను వాడాలని సూచించారు. హాస్పిటళ్లు మెడికల్ ఆక్సిజన్ ను జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుంటే 30 రోజుల్లో ఒక వ్యక్తి 406 మందికి వైరస్ అంటించగలడని రీసెర్చ్ లో తేలిందన్నారు.

అనవసరంగా బయటకెళ్లొద్దు: వీకే పాల్

అనవసరంగా బయటకు వెళ్లొద్దని, ఇంట్లోనూ మాస్కులు పెట్టుకోవాలని నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ ప్రజలను కోరారు. కరోనా కట్టడికి మాస్కులు,  వ్యాక్సిన్లే ఆయుధమన్నారు. ఇండ్లకు ఎవర్నీ ఆహ్వానించవద్దని కోరారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. పీరియడ్స్ టైమ్ లోనూ మహిళలు టీకా తీసుకోవచ్చన్నారు.