
ఖరీఫ్ లో మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని తెలిపింది. కేంద్రం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ తో ధాన్యం సేకరణ టార్గెట్ ను 46 లక్షల మెట్రిక్ టన్నులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోటా పెంచాలంటూ రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 20న కేంద్రానికి లేఖ రాసింది. ఆ లెటర్ ను కోడ్ చేస్తూ.. ఇవాళ(మంగళవారం) నిర్ణయం తీసుకుంది పౌరసరఫరాల శాఖ.
నిజానికి రాష్ట్రంతో కుదుర్చుకున్న MoU లోనే ఎంతైనా పంట కొంటామని చెప్పింది కేంద్రం. దీనిపై పార్లమెంటులో కూడా పీయూశ్ గోయల్ ప్రకటన చేశారు. వానాకాలం పంట ఎంతైనా కొంటామని క్లారిటీ ఇచ్చారు. అయినా టీఆర్ఎస్ మంత్రులు లిఖితపూర్వకంగా రాసిస్తేనే వెళ్తామంటూ హాడావిడి చేశారు.
మరిన్ని వార్తల కోసం...