జమ్మూ కాశ్మీర్‌‌కు ఫస్ట్ ఫేజ్ కింద పీజీ మెడికల్ సీట్లు మంజూరు

జమ్మూ కాశ్మీర్‌‌కు ఫస్ట్ ఫేజ్ కింద పీజీ మెడికల్ సీట్లు మంజూరు

న్యూఢిల్లీ :  జమ్మూకాశ్మీర్‌‌లోని 20 జిల్లాల్లో ఉన్న వివిధ సర్కారు ఆస్పత్రులకు 265 డీఎన్--బీ(డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్)పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లను కేంద్రం  మం జూరు చేసింది. సీట్లలో లోకల్ ఇన్ సర్వీస్ డాక్టర్లకు 50 శాతం రిజర్వ్ చేశారు.

ఈ చర్య తో జమ్మూకాశ్మీర్ ప్రజలకు ప్రయోజనం చేకూరడమే కాకుండా.. అక్కడి డాక్టర్లు తమ సొంత రంగంలో  శిక్షణ పొందే చాన్స్​ కూడా ఉంటుందని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ మంగళవారం తెలిపింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు మంచి మెడికల్ స్పెషలిస్టులను అందించాలనేదే తమ ఆలోచన అని కేంద్రం వెల్లడించింది.

సమర్థవంతమైన హెల్త్‌‌కేర్ డెలివరీ సిస్టమ్‌‌ తయారవుతుందని చెప్పింది. ఫస్ట్ ఫేజ్ కింద 20 జిల్లాల్లో 250కి పైగా పీజీ సీట్లు మంజూరు చేస్తున్నామని.. సెకండ్ ఫేజ్​లో మరిన్ని పీజీ సీట్లు ఇస్తామని వివరించింది. ఈ సీట్లలో 50 శాతం స్థానిక డాక్టర్లకే కేటాయిస్తామని వెల్లడించింది.