కరోనాతో అనాథలైన పిల్లలకు కేంద్రం కొత్త స్కీం

V6 Velugu Posted on May 29, 2021

కరోనా వైరస్ సోకి తల్లిదండ్రును కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలవాలని ప్రధాని మోడీ సర్కారు నిర్ణయించింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించడంతో పాటు..18 ఏళ్లు నిండిన వారికి నెలవారీ స్టైపెండ్, 23 ఏళ్లు వచ్చిన తర్వాత పీఎం-కేర్స్ నుంచి రూ.10 లక్షలు ఇచ్చేలా స్కీమ్ ప్రారంభించింది.

 అంతేకాదు ఉన్నత చదువుల కోసం రుణం.. దానిపై వడ్డీ పీఎం-కేర్స్ నుంచి చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు రూ. 5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఆరోగ్య బీమా..దానికి కూడా పీఎం-కేర్స్ నుంచే ప్రీమియం చెల్లించనుంది.

పిల్లలు దేశ భవిష్యత్తని.. వారికి భద్రత, సహాయం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రధాని మోడీ. తల్లిదండ్రులను కోల్పోయిన..అలాంటి చిన్నారుల భవిష్యత్తుపై భరోసా కల్పించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

Tagged Central government, corona, new scheme, PM-CARES, children orphaned

Latest Videos

Subscribe Now

More News