ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీస్

ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీస్

లడఖ్ మ్యాప్ ను తప్పుగా చూపినందుకు..

న్యూఢిల్లీ: ‘‘లేహ్ ను లడఖ్ యూనియన్ టెరిటరీ లో భాగంగా కాకుండా, జమ్మూ కాశ్మీర్ లో భాగంగా ఎందుకు చూపించారో వివరణ ఇవ్వండి..” అంటూ ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. దీనిపై ఐదు వర్కింగ్ డేస్ లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ట్విట్టర్ ఈ నోటీస్ కు స్పందించకపోయినా, సంతృప్తికరంగా వివరణ ఇవ్వకపోయినా.. ఆ సంస్థపై లీగల్ యాక్షన్ తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఐటీ యాక్ట్ కింద ట్విట్టర్ ను కేంద్రం బ్లాక్ చేసేందుకు చాన్స్ ఉందని చెప్పారు. దీనిపై పోలీస్ కేసు కూడా పెట్టొచ్చని, బాధ్యులకు ఆరు నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. లేహ్ రాజధానిగా లడఖ్ ను ప్రత్యేక యూటీగా పార్లమెంట్ ప్రకటించిందని, మ్యాప్ లో దానిని తప్పుగా చూపడం ద్వారా పార్లమెంట్ సార్వభౌమ నిర్ణయాన్ని తక్కువ చేయడమేనన్నారు.

For More News..

కరోనాకు 4 కోట్ల డోసులు రెడీ

ఇంజనీరింగ్​లో 28% సీట్లు ఖాళీ