షూటింగులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

షూటింగులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

కరోనా కారణంగా దేశంలో సినిమాలు మరియు టీవీ కార్యక్రమాల షూటింగులు మార్చి నుంచి ఆగిపోయాయి. వాటన్నింటిని తిరిగి ప్రారంభించడం కోసం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్య మరియు హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాత ఈ ఎస్‌ఓపిలను ఖరారు చేసినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

‘ఫిల్మ్ మరియు టీవీ ప్రోగ్రామ్ షూటింగ్ కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కెమెరా మెన్ లు తప్ప మిగతా వారందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు కచ్చితంగా ధరించాలి. ఈ నిబంధనలను అనుసరిస్తూ సినిమాలు మరియు టీవీ సీరియల్స్ షూటింగ్ తిరిగి ప్రారంభించవచ్చు. సినిమా మరియు టీవీ సీరియల్ షూటింగులను పునరుద్ధరించడాన్ని చిత్ర పరిశ్రమ స్వాగతిస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు షూటింగులకు అనుమతులిచ్చాయి. ఆయా రాష్ట్రాలు కూడా కేంద్ర నిబంధనలను తప్పకుండా పాటించాలి. అవసరమైతే రాష్ట్రాలు మరికొన్ని షరతులు కూడా పెట్టుకోవచ్చు. సినిమాలు మరియు టీవీలు ఆర్థికవ్యవస్థకు చాలా సహాయపడతాయి. సినిమాలు మరియు టీవీ సీరియల్స్ షూటింగ్ తిరిగి ప్రారంభించడం వల్ల ఉపాధి కూడా పెరుగుతుంది’అని జవదేకర్ అన్నారు.

మార్గదర్శకాల ప్రకారం.. షూటింగ్ స్పాట్లలో కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. షూటింగ్ స్పాట్ లో తక్కువ సంఖ్యలో నటులు మరియు సిబ్బంది ఉండేలా నిర్మాణ బృందం చర్యలు తీసుకోవాలి. ఇక బహిరంగ ప్రదేశాలలో షూటింగ్ నిర్వహిస్తే.. ప్రొడక్షన్ హౌస్‌లు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవాలి. నటులు మరియు సిబ్బంది రెస్టు రూమ్ ల విషయంలో కూడా భౌతిక దూర మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.

For More News..

ప్రభాస్ కు సారీ చెప్పి.. గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన సాయిధరమ్ తేజ్

దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు