కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే బాంబు పేలుళ్లకు కారణం..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే బాంబు పేలుళ్లకు కారణం..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటన యావత్​ దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేసిందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కేంద్రం, ఢిల్లీలోను బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, కేంద్ర నిఘా సంస్థలు వారి ఆధీనంలోనే పనిచేస్తున్నాయని, ఈ ఘటనకు కేంద్రం, నిఘా సంస్థల వైఫల్యమే కారణమని ఆరోపించారు. 

ఈ పేలుళ్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ  ఘటనపై వెంటనే అత్యున్నత స్థాయి దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌‌‌‌ చేశారు.