అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ వెనుక రాజకీయ దురుద్దేశం

అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ వెనుక రాజకీయ దురుద్దేశం

ఏపీ, తెలంగాణ అప్పులపై కేంద్రం ప్రజెంటేషన్ ఇచ్చింది. శ్రీలంక సంక్షోభంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆ దేశ పరిస్థితితో పాటు ఏపీ, తెలంగాణ అప్పులను సైతం కేంద్రం వివరించింది. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితికి రాజకీయ పరిస్థితులతో పాటు అపరిమితంగా చేసిన అప్పులే కారణమని తెలిపింది. ఈ సందర్బంగా భారత్ లోని కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అప్పులు, పర్యావసానాలపై విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు చేస్తున్న అపరిమిత అప్పులు దేశానికి చేటు చేస్తాయని అధికారులు వివరించారు.

అయితే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు చేసే అప్పులను ప్రస్తావించడాన్ని టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిమితికి మించి కేంద్రం చేసే అప్పులపై కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే  తెలంగాణ రెండవ స్థానంలో ఉందని ఎంపీలు చెప్పారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఉన్నాయని విమర్శించారు.