కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేమని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు 4 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్రానికి సూచించింది సుప్రీం కోర్టు. నేచురల్ డిజాస్టర్ కింద పరిహారం ప్రకటించాలని చెప్పింది. దీనిపై స్పందించిన కేంద్రం... అది సాధ్యం కాదని వివరించింది. వైరస్ తో 3 లక్షల 85 వేలకు పైగా చనిపోయారని... మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని కోర్టుకు వివరించింది. వాళ్లందరి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించలేమంది. 

కరోనాతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చితికిపోయాయని సుప్రీం కోర్టుకు చెప్పింది కేంద్రం. వైద్య ఖర్చులు పెరిగి, రెవెన్యూ తగ్గిందని వివరించింది. ప్రతి ఒక్క కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే అది అయ్యే పని కాదని తెలిపింది. నేచురల్ డిజాస్టర్ కింద పరిహారం అనేది భూకంపాలు, వరదలకే వర్తిస్తుందని సుప్రీం కోర్టుకు వివరించింది కేంద్రం. కరోనాతో లక్షల్లో జనం చనిపోయారని దాన్ని నేచురల్ డిజాస్టర్ కిందకు అన్వయించడం సరైంది కాదని తెలిపింది. ఈ ప్యాండమిక్ టైంలో ఉన్న కొన్ని డబ్బుల్ని పరిహారాల కింద ఇచ్చుకుంటూ పోతే... మంచి కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం.