స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులు

స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ లో దరఖాస్తులు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్​ అసిస్టెంట్ సబ్ ఇన్‌‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌‌లైన్​లో దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మొత్తం 540 పోస్టుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్)–122(పురుషులు- 94, మహిళలు- 10, డిపార్ట్‌‌మెంటల్- 18). హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్)–418(పురుషులు-319, మహిళలు- 36, డిపార్ట్‌‌మెంటల్- 63) ఖాళీగా ఉన్నాయి. 

అర్హత: ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ (10+2) సర్టిఫికేట్ ఉత్తీర్ణత ఉండాలి. వయసు18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అక్టోబర్​ 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ.100 ఎగ్జామ్​ ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాలకు www.cisfrectt.in వెబ్​సైట్​ చూడాలి.