CISFలో పారా మెడికల్ ఉద్యోగాలు ..రూ.100 ఫీజుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

CISFలో పారా మెడికల్ ఉద్యోగాలు ..రూ.100 ఫీజుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఏఎస్ఐ పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 8 నుంచి జూలై 07 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: ఏఎస్ఐ (ఫార్మసిస్ట్) / ఏఎస్ఐ (ఎక్స్-రే టెక్నీషియన్) / ఏఎస్ఐ (ల్యాబ్ టెక్నీషియన్)

మొత్తం ఖాళీలు: 24. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.  ఫార్మసీలో డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండాలి . ఫార్మాసిస్టుగా నమోదై ఉండాలి.  రేడియోగ్రఫీలో రెండేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో రెండేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 28ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 8.

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మన్​, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

ALSO READ : DRDOలో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్

లాస్ట్ డేట్: జులై 7.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ cisfrectt.cisf.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్/ ఓఎంఆర్ పద్ధతిలో జరిగే పరీక్షలు ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సంబంధిత ట్రేడులో పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఇస్తారు. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. రాత పరీక్షలో ప్రతిభ కనబర్చిన వారిని ఫిజికల్ స్టాండర్డ్ టెస్టుకు ఎంపిక చేస్తారు.