అప్లై చేసిన శామ్‌సంగ్, యాపిల్ ఫోన్ల తయారీ కంపెనీలు
వచ్చే ఐదేళ్లలో రూ. 11 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల తయారీ
న్యూఢిల్లీ: విదేశీ కంపెనీలు శామ్‌సంగ్, యాపిల్ ఫోన్ల తయారీ కంపెనీలతో పాటు లావా,మైక్రోమ్యాక్స్,డిక్సన్ వంటి దేశీయ కంపెనీలను కలిపి సుమారు 22 కంపెనీలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయని కేంద్ర ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ శనివారం అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీలు రూ.11లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను తయారు చేయనున్నాయని పేర్కొ
న్నారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌ను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం తెచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పీఎల్‌ఐ) కింద ఈ కంపెనీలు తమ ప్రపోజల్స్‌ను ఫైల్ చేశాయని చెప్పారు. ఈ కంపెనీల పెట్టుబడులతో మొత్తంగా 12 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని పేర్కొన్నారు. మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా, తొమ్మిది లక్షల మందికి పరోక్షంగా జాబ్స్ వస్తాయని చెప్పారు.
‘దేశంలో రూ.11 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల తయారీ జరగనుంది. రూ. 7 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతాయి. ఈ స్కీమ్ కింద అప్లై చేసిన కంపెనీలన్నింటికి పర్సనల్‌గా థాంక్స్ చెబుతున్నా’ అని ప్రసాద్ అన్నారు. తైవాన్ , సౌత్‌కొరియా, జర్మనీ, ఆస్ట్రియా వంటి వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఈ 22 కంపెనీలలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ఇంటర్నేషనల్ కంపెనీలుఎక్కువగా రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న మొబైల్‌ఫోన్లను తయారు చేస్తాయి. శామ్‌సంగ్, ఫాక్స్‌కాన్‌హాన్‌హై, రైజింగ్ స్టార్ , విస్ట్రన్, పెగట్రన్ వంటి విదేశీ కంపెనీలు ఈ స్కీమ్ కింద అప్లైచేశాయి’ అని ప్రసాద్ పేర్కొన్నారు. కాగా, ఫాక్స్‌కాన్ హాన్‌హై, విస్ట్రన్,పెగట్రన్ వంటి కంపెనీలు యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తున్న కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు.
పెద్ద ఎత్తున ఎలక్ట్రా నిక్ కాంపోనెంట్స్ తయారీ
రెవెన్యూ పరంగా చూస్తే గ్లోబల్‌సేల్స్‌లో యాపిల్ వాటా 37 శాతంగా, శామ్‌సంగ్ వాటా 22 శాతంగా ఉంది. పీఎల్ ఐస్కీమ్ ద్వారాఇండియాలో ఈ కంపెనీల బేస్ పెరుగుతుందని మినిస్ట్రి ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ(మెయిటీ) అంచనా వేస్తోంది. ఈ కంపెనీల ప్రపోజల్స్ అప్రూవ్ అయితే రూ.వేలకోట్లు ఇండియాలోకి వస్తాయని ప్రసాద్ పేర్కొన్నారు. లావా, డిక్సన్‌టెక్నాలజీస్, భగ్వతి(మైక్రోమ్యాక్స్) పడ్జెట్ ఎలక్ట్రానిక్స్, సోజో మాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్, ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ఇండియన్ కంపెనీలు ఈ స్కీమ్ కింద తమ ప్రపోజల్స్‌ను ఫైల్ చేశాయి. మరో 10 కంపెనీలు స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సెగ్మెంట్ కింద తమ అప్లికేషన్లను ఫైల్ చేశాయి. ఇందులో మదర్ బోర్డ్ లను తయారు చేసే ఏటీ అండ్ ఎస్, అసెంట్ సర్క్యూట్స్, సహస్రా, విటెస్కో వంటి కంపెనీలున్నాయి. వీటి ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల విలువైన కాంపోనెంట్ల తయారీ జరుగుతుందని అంచనాలున్నాయి.
ఈ స్కీమ్‌ల కింద చైనీస్ కంపెనీల అప్లికేషన్లు ఏమి లేవు. ఏ దేశం నుంచి వచ్చే ఇన్వెస్ట్‌మెంట్లనైనా ఇండియాలోకి అనుమతి ఉంటుందని, కానీ ఈ కంపెనీలు ఇక్కడి రూల్స్, సెక్యూరిటీ క్లియరెన్స్‌లను ఫాలో కావాలని ప్రసాద్ పేర్కొన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్‌ను పెంచేందుకు ప్రభుత్వం మూడు స్కీమ్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇవి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్ స్కీమ్(పీఎల్‌ఐ),ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, సెమీకండక్టస్ తయారీ స్కీమ్, సవరించిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్(ఈఎంసీ2.0) స్కీమ్. ఎలక్ట్రానిక్స్ సెక్టార్ లోకి రూ.లక్ష కోట్ల ఇన్వెస్ట్ మెంట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో వీటి నుంచి రూ. 10 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని ఆశిస్తోంది.

