కరోనా వస్తే ప్రజాప్రతినిధులు కూడా గాంధీలోనే చేరాలి

కరోనా వస్తే ప్రజాప్రతినిధులు కూడా గాంధీలోనే చేరాలి

కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నదృష్ట్యా గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం‌ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ‘ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో టెస్టులు తక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణలో పరిస్థితులపై మంత్రి ఈటల, అధికారులతో మాట్లాడాను. ఢిల్లీ, ముంబై, చెన్నై తర్వాత హైద్రాబాద్ లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణకు 600 వెంటిలేటర్లు పంపించాం. గాంధీలో పేషెంట్లకు మానసిన ధైర్యాన్ని ఇచ్చే బాధ్యత స్థానిక ఎంపీగా నాపై ఉంది. వైద్య సిబ్బందికి, కరోనా బాధితులకు ధైర్యం కల్పించటానికే గాంధీకి వచ్చాను. గాంధీ ఆస్పత్రిలో 250పైగా వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులను కట్టడి చేయాల్సన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గాంధీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. కోవిడ్ కు వ్యాక్సిన్ లేదు కాబట్టి ప్రజలే తమను తాము కాపాడుకోవాలి’ అని ఆయన అన్నారు.

For More News..

ట్రెయినింగ్‌ కోసం కారు అమ్మకానికి పెట్టిన ప్లేయర్

ఊపందుకున్న సైకిల్ సవారీ

గ్రేటర్లో కరోనా మృతులకోసం ప్రత్యేక శ్మశానాలు!