జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిస్తాం

జరిగిన నష్టంపై కేంద్రానికి నివేదిస్తాం

నిర్మల్/ఆదిలాబాద్/​​కడెం,వెలుగు: వర్షాలు... వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టులు, ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు శుక్రవారం ఉమ్మడి జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. నిర్మల్​ జిల్లా కడెం ప్రాజెక్టు దెబ్బతిన్న  18 గేట్లు, మైసమ్మ ఆలయం వద్ద పడ్డ గండి, పాండ్వపుర్ వంతెన వద్ద తెగిన రోడ్డును సభ్యులు చూశారు. గేట్ల పరిస్థితిపై ఇరిగేషన్​ఆఫీసర్లతో మాట్లాడారు.

ప్రాజెక్టు మరమ్మతుల కోసం అయ్యే ఖర్చుల వివరాలు కలెక్టర్ ముషారఫ్ ​అలీ ఫారూఖీ వారికి వివరించారు. తక్షణ రిపేర్ల కోసం రూ.3.5  కోట్లు అవసరమని పేర్కొన్నారు. జిల్లాలో 25 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఫలితంగా రూ.19. 76  కోట్ల నష్టం జరిగిందని కలెక్టర్​తెలిపారు. 734 చెరువులు దెబ్బతిన్నాయని, ఆర్ అండ్ బీకి చెందిన నాలుగు వంతెనలు,11 రోడ్లు, పంచాయతీ రాజ్​శాఖకు సంబంధించిన 69 రోడ్లు దెబ్బతినడంతో దాదాపు రూ.30 కోట్ల నష్టం జరిగిందన్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో రోడ్లు, పంట పొలాలు, బ్రిడ్జీలను సెంట్రల్​టీం పరిశీలించింది. సభ్యులు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని సెంట్రల్ హోమ్ అఫైర్స్​ జాయింట్ సెక్రటరీ సౌరవ్ రాయ్​ తెలిపారు. 
కార్యక్రమంలో బృందం సభ్యులు దీప్ శేఖర్ సింగల్, కృష్ణ ప్రసాద్, నిర్మల్, ఆదిలాబాద్​ కలెక్టర్లు ముషరఫ్​అలీ ఫారూఖీ, సిక్తా పట్నాయక్,​ అడిషనల్​కలెక్టర్లు హేమంత్​బోర్కడే, రిజ్వాన్ బాషా షేక్, నటరాజన్, ఇరిగేషన్​ ఎస్ఈ సుశీల్ దేశ్ పాండే, ఈఈ రాజశేఖర్, డీఈ బోజదాసు, తహసీల్దార్​రాథోడ్ మోహన్ సింగ్, ఏవో కైలాశ్, పీఆర్ డీఈ శైలేందర్ తదితరులు ఉన్నారు.