Adani : అదానీ ఇష్యూపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే

Adani : అదానీ ఇష్యూపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే

న్యూఢిల్లీ : అదానీ -హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకరించింది. అదానీ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇన్వెస్టర్ల భద్రత కోసం కమిటీ  వేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని సెబీ పర్యవేక్షిస్తోందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి చెప్పారు. కేంద్రం వివరణపై స్పందించిన న్యాయమూర్తి బుధవారంలోగా  కమిటీ సబ్యుల పేర్లను సుప్రీంకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ కు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. 

అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ కు పాల్పడిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం కేంద్రం వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.