మాల్దీవులకు సాయంలో 170 కోట్లు కోత

 మాల్దీవులకు సాయంలో 170 కోట్లు కోత

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్​లో విదేశాంగ శాఖకు రూ. 22,154 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇతర దేశాలకు మనదేశం అందించే ఆర్థిక, అభివృద్ధి సాయం కింద అత్యధికంగా భూటాన్​కు రూ.2,068 కోట్లు అందిచాలని నిర్ణయించారు. కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో భాగంగా చాబహార్ పోర్టు కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ఈసారి మాల్దీవులకు బడ్జెట్ రూ.600 కోట్లకు తగ్గించారు.

అఫ్గానిస్తాన్​తో ఇప్పటికే ఉన్న ప్రత్యేక సంబంధాలకు కొనసాగింపుగా, ఆ దేశం కోసం రూ.200 కోట్ల బడ్జెట్ సాయాన్ని కేటాయించారు. అభివృద్ధి సాయం కింద బంగ్లాదేశ్​కు రూ.120 కోట్లు, శ్రీలంకకు, రూ.75 కోట్లు, మయన్మార్​కు రూ.250 కోట్లు, మారిషస్​కు రూ.370 కోట్లు, నేపాల్​కు రూ.700 కోట్లు అందించనున్నారు. ఆఫ్రికా దేశాలకు ప్రత్యేకంగా రూ.200 కోట్లు కేటాయించారు.