నవంబర్‌‌ వరకు ఉచిత రేషన్‌ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం

నవంబర్‌‌ వరకు ఉచిత రేషన్‌ ఇచ్చేందుకు  కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి గరీభ్‌ కల్యాణ్‌ అన్నా యోజన కింద మరో ఐదు నెలల పాటు రేషన్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌ నిర్వహించారు. దీని కింద రూ.1.49 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ మినిస్టర్‌‌ ప్రకాశ్‌ జవదేకర్‌‌ అన్నారు. “ పేదలకు సాయం చేసేందుకు పీఎంజీకేవై ఎక్స్‌టెన్ష్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జులై నుంచి నవంబర్‌‌ వరకు ఫ్రీగా తిండి గింజలు ఇచ్చేందుకు వీలు కలుగుతుంది” అని కేబినెట్‌ మీటింగ్‌ అనంతరం జవదేకర్‌‌ ప్రకటించారు. పీఎంజీకేవైను నవంబర్‌‌ వరకు ఎక్స్‌టెండ్‌ చేస్తామని ప్రధాని మోడీ జూన్‌ 30న జాతీనుద్దేశించి ప్రసంగిచిన సమయంలో దీనిపై ప్రకటన చేశారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన / ఆత్మ నిర్భర భారత్‌ కింద ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ 24శాతాన్ని మరో మూడు నెలలు పెంచేందుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని వల్ల దాదాపు 72లోల మంది బెనిఫిట్‌ పొందనున్నారు. పబ్లిక్‌ సెక్టార్‌‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలైన ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌, నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెట్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌లకు రూ. 12,450 కోట్లు క్యాపిటెల్‌ ఇన్ఫ్యూజన్‌ ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. 7.4 కోట్ల మంది పేద మహిళలకు సెప్టెంబర్‌‌ వరకు ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదించింది.