న్యూఢిల్లీ : కేంద్రంలోని అన్ని డిపార్ట్ మెంట్లలో డిప్యూటీ సెక్రటరీస్ తో పాటు ఆ పై స్థాయి ఉన్నతాధికారులు అంతా ఆఫీస్ లకు రావాలని కేంద్రం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అంతా కన్నా తక్కువ కేడర్ లో ఉన్న ఉద్యోగులకు నెలకు 33 శాతం హాజరు ఉండాలని సూచించారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత 21 రోజులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీస్ లకు రావాలని కోరింది. సోమవారం నుంచే జాయింట్ సెక్రటరీ లు అంతా కన్నా పై స్థాయి ఉన్నతాధికారులు ఆఫీస్ లకు వస్తున్నారు. ఎస్సెన్షల్ సర్వీసుల్లో ఉద్యోగులు ఎప్పటి మాదిరిగానే పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అన్ని రాష్ట్రాలు, యూటీలు కూడా లిమిటెడ్ స్టాఫ్ తో పనిచేయించుకోవచ్చని సూచించింది.
