కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తుంది: మమత బెనర్జీ

కేంద్రం ఆధార్ కార్డులను డీయాక్టివేట్  చేస్తుంది: మమత బెనర్జీ
  • ప్రజలు స్కీములు పొందకుండా అడ్డుకుంటున్నది: మమత

సురి(పశ్చిమ్​బెంగాల్​): బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆధార్ కార్డును ‘‘డీయాక్టివేట్’’ చేస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. లోక్‌‌‌‌సభ ఎన్నికలకు ముందు పేదలు తమ బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ స్కీమ్​ల ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం బీర్భూమ్ జిల్లాలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో మమత మాట్లాడారు.

 ‘‘జాగ్రత్తగా ఉండండి, వారు ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తున్నారు. బెంగాల్‌‌‌‌లోని అనేక జిల్లాల్లో అనేక ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. వారు ఆధార్ కార్డులను డీలింక్ చేస్తున్నారు. దీంతో ఎన్నికలకు ముందు ప్రజలు సామాజిక, ఆర్థిక ప్రయోజనాలైన ఉచిత రేషన్, బ్యాంకుల ద్వారా లక్ష్మీ భండార్ పొందలేరని వారు భావిస్తున్నరు. ఆధార్ కార్డ్ లేకపోయినా లబ్ధిదారులకు మా ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చెల్లిస్తుంది. లబ్ధిదారులపై ఎలాంటి ప్రభావం పడనీయం”అని ఆమె అన్నారు. ‘‘తమ పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్‌‌‌‌లో రైతులు చేస్తున్న నిరసనకు సెల్యూట్ చేస్తున్నాను. వారిపై చేస్తున్న దాడులను ఖండిస్తున్నాను’’ అని ఆమె తెలిపారు.