కరోనానూ వదలని అవినీతి.. కేంద్రానికి 40 వేల ఫిర్యాదులు

కరోనానూ వదలని అవినీతి.. కేంద్రానికి 40 వేల ఫిర్యాదులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌‌నూ అవినీతి రక్కసి వదల్లేదు. కరోనాకు సంబంధించి కేంద్రానికి 40 వేల కంప్లయింట్‌‌లు అందాయని తెలుస్తోంది. కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ఫిర్యాదులను నమోదు చేయడానికి కేంద్రం ఏప్రిల్ నెలలో ప్రత్యేక పోర్టల్‌‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్‌‌కు సుమారుగా 1,67,000 వేల కంప్లయింట్‌‌లు అందాయి. ఇందులో లక్షన్నర కేసులను కేంద్రం గుర్తించింది. ఫిర్యాదులను డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియెన్సెస్ వెబ్‌‌సైట్‌‌ నుంచి స్వీకరించింది. సదరు ఫిర్యాదుల్లో కరోనా కేసుల విషయంలో లంచాలు, నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అధికారుల వేధింపులు వంటివి ఉన్నాయి. సదరు ఫిర్యాదుల్లో ఎన్ని కంప్లయింట్‌‌లు అవినీతికి సంబంధించినవని, వాటిని పరిష్కరించారా అంటూ ప్రధాని మోడీ ఆరా తీశారని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.