మీ వ్యాక్సిన్లు మీరే కొనుక్కోండి.. కరోనాపై కేంద్రం సంచలన నిర్ణయం

 మీ వ్యాక్సిన్లు మీరే కొనుక్కోండి.. కరోనాపై కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కొవిడ్ వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయ‌లేమంటూ చేతులెత్తిసింది. రాష్ట్రాలే సొంతంగా వ్యాక్సిన్‌లను స‌ర‌ఫ‌రా చేసుకోవాలని చెప్పింది. కొవిడ్  వ్యాక్సిన్ కంపెనీల నుంచి నేరుగా రాష్ట్రాలే స్వంత నిధుత‌లో కొనుగోలు చేసుకోవాలంటూ ఉచిత స‌ల‌హా ఇచ్చింది.  మూడవ డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయడం లేదని  కేంద్ర వర్గాలు తెలిపాయి. 

గతేడాది జనవరి 16న దేశవ్యాప్తంగా  ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా  రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సిన్‌లను కేంద్రం ఉచితంగా అందించింది. అయితే గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం రూ. 4,237 కోట్లను  2022-23 బడ్జెట్ ల టీకాల ప్రయోజనాల కోసం కేటాయించింది.  మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా కోవిడ్19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.