కొవిడ్ 19 ఎమర్జెన్సీ ప్యాకేజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కొవిడ్ 19 ఎమర్జెన్సీ ప్యాకేజ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: రాష్ట్రాలు, యూనియన్ టెర్రిటరీల కోసం కొవిడ్ 19 ఎమర్జెన్సీ ప్యాకేజీకి కేంద్రం గురువారం ఓకే చెప్పింది. నేషనల్, స్టేట్ లెవెల్ లో అవసరమైన డ్రగ్స్, మెడికల్ ఎక్విప్ మెంట్స్ సమకూర్చుకోవడం, సర్వైలెన్స్ బలోపేతం చేయడం, ల్యాబ్ ల ఏర్పాటు, బయోసెక్యూరిటీ సంసిద్ధత కోసం ఈ ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇది వందశాతం సెంట్రల్ ఫండెడ్ ప్యాకేజీ అని, మూడు విడతల్లో అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ అన్ని రాష్ట్రాలు, యూటీల చీఫ్ సెక్రటరీలు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లెటర్లు రాసింది. మొదటి ఫేజ్ లో వచ్చే జూన్ నాటికి నేషనల్ హెల్త్ మిషన్ కింద ఫండ్స్ రిలీజ్ చేస్తామంది. ఫేజ్ 1 లో కొవిడ్ 19 హాస్పిటళ్లలో ఐసోలేషన్ వార్డులు, ఐసీయూలు, వెంటిలేటర్లు, ల్యాబ్ ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వలంటీర్లకు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించింది. కొన్నిల్యాబ్ లను గుర్తించి, వాటిలో డయాగ్నస్టిక్ సామర్థ్యం పెంపు, శాంపిళ్ల ట్రాన్స్ పోర్టుకు మొబిలిటీ సపోర్ట్ అందిస్తామని చెప్పింది.ఈ ప్యాకేజ్ లో భాగంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్స్ (పీపీఈ)లు, ఎన్ 95 మాస్కులు, వెంటిలేటర్లను కేంద్రమే అందిస్తుందని తెలిపింది. హాస్పిటళ్లు, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ యుటిలిటీస్, అంబులెన్స్ లలో డిస్ ఇన్ఫెక్టెంట్లు స్ప్రే చేస్తామని చెప్పింది. ఈ ఏడాది జూన్ వరకు ఫేజ్ 1, జులై నుంచి 2021 మార్చి వరకు ఫేజ్ 2, ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2024 వరకు ఫేజ్ 3 అమలు చేస్తామని చెప్పింది.